తొలి శుభోదయం న్యూస్ i:-
కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో…. ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలో 10 కోట్లతో అభివృద్ధి, 45 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వెల్లడించారు. రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని పంచాయతీలోని పెద్దపల్లెపాలెంలో ఆదివారం నిర్వహించారు. పథకాలు, వాటి కోసం చేసిన ఖర్చును కరపత్రాల ద్వారా వివరించారు.గ్రామంలో సీసీ రోడ్లు, స్మశానాల అభివృద్ధి, తాగునీటి పథకం పైపులైన్లు, ఇతర పనుల కోసం 15 లక్షల వరకు ఖర్చు చేసినట్లు నాగేశ్వరరావు చెప్పారు.పంచాయతీలో మత్స్యకార భరోసా పథకం ద్వారా, 1068 మందికి 4.27 కోట్ల సహాయం అందించినట్లు తెలిపారు.బింగినపల్లి నుంచి గ్రామం వరకు త్వరలోనే కొత్త రోడ్డు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామానికి వచ్చే ఆర్టీసీ బస్సు ట్రిప్పులను పెంచాలని పలువురు కోరారు. గ్రామ యువకుల విజ్ఞప్తి మేరకు, సొంత నిధులతో గ్రామంలో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయిస్తానని, త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు.