తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దర్శి పోలీసులు అబ్బయ్యపాలెం గ్రామ పరిధిలోని పొలాల్లో పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1,10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.అసాంఘిక కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.