తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమావంశీ ఐఏఎస్ గారు కందుకూరులో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి నేటికి ఒక సంవత్సరం పూర్తి అయిన కారణంగా మంగళవారం అనగా 11-11-2026 న సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ నందు మాజీ కౌన్సిలర్ రేణమాల అయ్యన్న, దళిత నాయకులు ఓరుపల్లి. శ్రీను అను వారలతో కలిసి సబ్ కలెక్టర్ గారికి హృదయ పూర్వకంగా అభినందనలు తెలియచేయడం జరిగింది.ఆయనకు దుస్సా లవాతో చిరు సత్కారం చేయడం జరిగింది.వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ను మంచివారైన సబ్ కలెక్టర్ గారితో కందుకూరు పట్టణం, మండల నియోజక వర్గ దళిత సమస్యలపై ఆయనతో చర్చించినప్పుడు అయన ఎంతో సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ పధకాలు దళితులకు దక్కేలా ప్రయత్నిస్తానని ఆయన స్పష్ట పరిచారు. భూములు, సంక్షేమ పధకాలు విషయంలో దళితులకు సంపూర్ణ న్యాయం జరిగేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేలు జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు