తొలి శుభోదయం ప్రకాశం:-

ముండ్లమూరు మండలం సంకరవారిపాలెం గ్రామంలో గునపూడి సురేష్ బాబు ఇంటిలో తాళాలు పగులగొట్టి జరిగిన వెండి భూషణాల దొంగతనం కేసును ముండ్లమూరు పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే ముండ్లమూరు ఎస్ఐ కమలాకర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు చేపట్టగా, నిందితుడైన కోటేశ్వరరావు @ వెంకటేశ్వరరావు (55) ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నుండి మొత్తం రూ.1,10,000/- విలువగల వెండి భూషణాలు స్వాధీనం
కేసు జరిగిన 24 గంటల్లోనే కీలక ఆధారాలు సేకరించి అరెస్ట్
ప్రజల భద్రత కోసం శీఘ్రగతి దర్యాప్తు – పోలీసుల అప్రమత్తతకు ఫలితంఈ కేసును విజయవంతంగా ఛేదించిన ముండ్లమూరు ఎస్ఐ కమలాకర్ తో పాటు దర్యాప్తును పర్యవేక్షించిన సీఐ రామారావు గారు, DSP లక్ష్మీనారాయణ మరియు మొత్తం పోలీసు బృందాన్ని జిల్లా పోలీస్ అధికారులు అభినందించారు.ప్రజల భద్రత కోసం ప్రకాశం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తారు.
సందేహాస్పద వ్యక్తులు, సంఘటనలు గమనించిన వెంటనే 100 / Dial 112 కు సమాచారం ఇవ్వండి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *