CK కన్వెన్షన్ హాల్ మంగళగిరిలో నిర్వహించిన జనసైనికులతో ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి జనసేన పార్టీ అధిష్టానం ఆహ్వానం మేరకు కనపర్తి మనోజ్ కుమార్ గారు పాల్గొన్నారు. గతంలో YCP అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పొన్నలూరు మండలం నుండి ZPTC అభ్యర్థిగా పోటీ చేసి, డబ్బులకు మరియు చంపేస్తాం అనే బెదిరింపులకు లొంగకుండా దాడులకి దౌర్జన్యాలకి భయపడకుండా ధైర్యంగా నిలబడి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టి, సింగరబొట్లపాలెంలో పోలింగ్ కేంద్రాల బయట గాజు గ్లాస్ గుర్తు లేకుండా చేయడం మరియు జనసేన పార్టీ ఏజెంట్లను కొట్టడం లాంటి దౌర్జన్యాలకు ఆరోజు YCP నాయకులు పాల్పడ్డారు, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో పొన్నలూరు మండలం నుండి ద్వితీయ పార్టీ మరియు ద్వితీయ శ్రేణి అభ్యర్థి భయపడి వెనక్కి తగ్గిన, జనరల్ స్థానంలో SC కులానికి చెందిన కనపర్తి మనోజ్ కుమార్ భయపడకుండా అన్ని పరిస్థితులను ఎదిరించి ధైర్యంగా ఎదుర్కొని ZPTC గా పోటీ చేసినందుకు కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త శ్రీ కనపర్తి మనోజ్ కుమార్ గారిని నిన్నటి రోజున జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గౌరవనీయులు పెద్దలు నాదెండ్ల మనోహర్ అభినందించడం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *