ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రధాన రహదారులు, కూడళ్లు మరియు ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు.హెల్మెట్ ధరించకపోవడం, సీటుబెల్ట్ వినియోగించకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం, అధిక వేగం, పత్రాలు లేకుండా వాహనాలు నడపడం తదితర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను పోలీసులు గుర్తించి ఈ-చలాన్లు విధిస్తున్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించి, అన్ని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు.