సింగరాయకొండ మండల కేంద్రంలోని అన్నా క్యాంటీన్‌ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి సాధారణ ప్రజలతో కలిసి క్యూలైన్‌లో నిలబడి రూ.5 చెల్లించి భోజనం టోకెన్ తీసుకుని, వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు. ఆహారం రుచికరంగా, పౌష్టికంగా ఉందని పేర్కొంటూ క్యాంటీన్‌లో పరిశుభ్రత, నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.పేదలు, నిరుపేదలు, దినసరి కూలీలు, సామాన్య ప్రజలకు కేవలం రూ.5కే నాణ్యమైన భోజనం అందించడమే అన్నా క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.పుట్టినరోజులు, పెళ్లిరోజులు, కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో అన్నా క్యాంటీన్లలో పేదలకు భోజన దాతలుగా ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *