తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మంగళవారం ప్రారంభించారు.ఈ యూనిట్ ద్వారా స్థానికంగానే రక్త, మూత్ర పరీక్షలతో పాటు పలు వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించేందుకు ల్యాబ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. సీజనల్, అంటువ్యాధులను ప్రారంభ దశలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టడంలో ఈ కేంద్రం కీలకంగా పనిచేస్తుందన్నారు.అనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న గదులు, విభాగాలను పునరుద్ధరించేందుకు మరమ్మతులు, మౌలిక సదుపాయాలకు అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని వైద్యాధికారులను ఆదేశించారు.ఆయుర్వేద కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం నిర్మాణంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం–1ను కూడా మంత్రి పరిశీలించారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.