విద్యార్థిని,విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
నాగార్జున పబ్లిక్ స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
నాగార్జున పబ్లిక్ స్కూల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ వి. శాలినీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల గొప్పతనాన్ని తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, పాటలు, నృత్యాలు నిర్వహించారు. ఉపాధ్యాయుల పట్ల తమ గౌరవాన్ని, కృతజ్ఞతను వివిధ కార్యక్రమాల ద్వారా వ్యక్తం చేశారు.2026–27 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎస్.కె. జాకీరా, జి. ప్రమీల, ఎం. భాగ్యలక్ష్మిలను ఎంపిక చేసి పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. విద్యార్థుల అభ్యున్నతికి, విద్యాబోధనలో వారు చేస్తున్న విశిష్ట సేవలను అభినందిస్తూ ఈ సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ వి. శాలినీ రెడ్డి మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యత, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలుస్తారని తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా రంగానికి అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య ప్రతినిధులు వి. మర్రెడ్డి, కె. శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డి. శివ కుమార్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.