తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :-
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన శివాపురం రమేష్ గిద్దలూరు పట్టణం పి ఆర్ కాలనీలోని ఎంపీపీ స్కూల్ లో పిఎస్ హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం టీచర్స్ డే సందర్భంగా జిల్లాలోని ఉపాధ్యాయ వృత్తిలో మేటి సేవలందిస్తున్న టీచర్లకు ప్రోత్సాహక ప్రశంస పత్రాలు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందిస్తారు. ఈ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయుని కేటగిరీకి ఎంపికైన శివాపురం రమేష్ బాబు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత మరియు జిల్లా విద్యాశాఖ అధికారి సామ సుబ్బారావు ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే ప్రశంస ప్రోత్సాహ మరియు అవార్డును శివాపురం రమేష్ బాబుకు అందించారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న రమేష్ బాబుకు గ్రామ ప్రజలు మిత్రులు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.