టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్ అధ్యాపక వృత్తి యొక్క ప్రాధాన్యతను వివరించారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని, విద్యార్థుల యొక్క ఉన్నతికి ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సాహం అందిస్తారని తెలియజేశారు. కళాశాలలో ఎంతో జ్ఞానవంతులైన అధ్యాపకులు ఉన్నారని, వారి యొక్క ప్రతిభను వినియోగించుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ పుష్పమ్మ మాట్లాడుతూ గురువు యొక్క గొప్పతనాన్ని మరియు వారి యొక్క మార్గదర్శకత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి తమ జీవితాల్లో ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని ఉద్భోదించారు. ఈ సందర్భంగా తమ కళాశాలకు చెందిన రసాయన శాస్త్ర అధ్యాపకురాలు, డాక్టర్ కె.వి. పద్మావతి కి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకురాలు అవార్డు రావడం గర్వకారణమని ప్రిన్సిపాల్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శ్రీ కే. శ్రీనివాసులు, డాక్టర్ పి. రాజగోపాల్, శ్రీ కె. నరేష్ రాజా, శ్రీ బి. కమల బాబు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *