
తొలి శుభోదయం సింగరాయకొండ:-
మంత్రి డా.శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు ఆధ్వర్యంలో పకీర్ పాలెంకు చెందిన ఢిల్లు సహకారంతో సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని 5 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మొత్తం 1,000 నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయడంతో పాటు, సుమారు 300 మంది విద్యార్థులకు శుభదిన భోజనాన్ని ఏర్పాటు చేసి అందించారు.ఈ సేవా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా వేల్పుల సింగయ్య పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అన్ని విధాలా సహకారం అందించడం సమాజపు బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తి తో భవిష్యత్తులో కూడా మంత్రి స్వామి,దామచర్ల సత్యల నాయకత్వం లో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు వేల్పుల వెంకట్రావు,నర్రా రాంబాబు,శీలం చంటి,వేల్పుల సుధాకర్,షేక్ నసీర్, రఫీ, ఉపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు, న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు,అన్వర్,రాజగోపాల్,వలి,ప్రభాకర్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి పుట్టినరోజు వేడుకలను కేకు కట్ చేసి సంబరంగా జరుపుకొని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
