తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో ప్రైవేట్ రంగంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు ‘బెస్ట్ టీచర్స్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం మార్కాపురం పట్టణంలోని పి. కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి, అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు కె. తులసి విష్ణు ప్రసాద్ హాజరై ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా కంభం మండలంలోని వాసవి విద్యానికేతన్ ఉపాధ్యాయులు సందు నారాయణ Ch రంగస్వామి మరియు మహబూబ్ వలి కు ‘బెస్ట్ టీచర్స్’ అవార్డులను ప్రదానం చేశారు.
అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను అపుస్మా ప్రైవేట్ టీచర్స్ సంఘం అధ్యక్షుడు జీ.వి. మల్లికార్జున రెడ్డి, వాసవి విద్యాసంస్థల అధినేత కరస్పాండెంట్ గోళ్ళ బాబు సార్ , అభినందించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.