దామరమడుగు గ్రామంలోని శ్రీ మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో నిర్వహించిన నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన, మహా కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది.అనంతరం శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకుని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించాను.ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అర్చకుల వసతి గృహం, వాచ్‌మెన్ వసతి గృహాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది. దేవాలయాల అభివృద్ధితో పాటు, వాటిలో సేవలందించే అర్చకులు, సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడానికీ కృషి చేస్తాను.స్వామివారి ఆశీస్సులు కోవూరు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *