జరుగుమల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జూద కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తుమ్మాడు గ్రామంలో జూదం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదంలో పాల్గొంటున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5,900/- నగదు స్వాధీనం చేసుకున్నారు.జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
జరుగుమల్లి పోలీసులు – ప్రజా భద్రతే ప్రధాన లక్ష్యం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *