గుడ్లూరు లోని జగనన్న కాలనీకి వెంటనే మంచినీరు సరఫరా చేయాలని, సిపిఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుడ్లూరు ఎమ్మెస్సార్ కాలేజీ, గంధర్వ గిరిజన కాలేజీ, జగనన్న కాలనీ సమస్యలపై, సోమవారం నాడు గుడ్లూరు మండల కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు, సిపిఎం శాఖ కార్యదర్శి గుత్తి మల్లికార్జున అధ్యక్షత వహించారు. సందర్భంగా సిపిఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గుడ్లూరు లో, ఎమ్మెస్సార్ గిరిజన కాలనీ, గంధర్వ గిరిజన కాలనీ, జగనన్న గిరిజన కాల నీ లలో మౌలిక వసతులు పాలకవర్గాలు విఫలం చెందా యని ఆవేదన వ్యక్తం చేశారు, జగనన్న కాలనీ ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచిన, ఆ కాలనీకి ఇప్పటికి కూడా మంచినీళ్లు సరఫరా కాని కారణంగా ట్యాంకరు 600 రూపాయలు పెట్టి కొనుక్కోవలసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కాలనీ ఇప్పటికీ చీకట్లో మగ్గుతున్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నది అన్నట్లుగా, మంచినీటి ట్యాంకర్ ఉంది, మంచినీరు రాదు, కరెంటు స్తంభాలు ఉన్నాయి వీరి దీపాలు వెలగవు. ఆ కాలం యొక్క దుస్థితి, నీ అధికారులకు విన్నవించారు, గంధర్వ గిరిజన కాలనీలో, మనిషి చనిపోతే , పూడ్చి చేయడానికి స్మశాన స్థలం లేదని తెలియజేశారు. ఎమ్మెస్సార్ గిరిజన కాలనీలో ఇళ్ల స్థలాలు లేక ఒక్కొక్క ఇంటిలో మూడు కుటుంబాలు నివాసం ఉన్నారని, ఇది ఎలా సాధ్యం అని అధికారులను ప్రశ్నించారు. వెంటనే తాగునీరు సరఫరా చేయాలని, వీధి దీపాలు వెలిగించాలని, స్మశాన స్థలం ఏర్పాటు చేయాలని, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, స్థానిక డిప్యూటీ తహసిల్దారు గారికి, ఎంపీడీవో మల్లికార్జున రావు గారికి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జి వెంకటేశ్వర్లు, శాఖా కార్యదర్శి గుత్తి మల్లికార్జున, సిపిఎం నాయకులు, దా మా కృష్ణయ్య, పాలకుర్తి నాగేశ్వరరావు, బీరకాయల వెంకటేశ్వరరావు, రాపూరి సురేష్, ద న్యాసి బాలకోటయ్య, త లపల ఆనందరావు, గిరిజనులు, యశోదమ్మ, పొట్లూరి లావణ్య, జయంపు సుజాత, ఏడుకొండలు, కాకి నేటి శ్రీనివాసులు, పిట్ల పార్వతి, ఎం రజిత ఏ కస్తూరి సిహెచ్ శ్రావణి కల్పన మెలికా ప్రమీల నాంచారమ్మ భాగ్యం తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *