తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
కర్నూలులో సెప్టెంబర్ 6న నిర్వహించిన 13వ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గిద్దలూరుకు చెందిన అరుణోదయ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.ఈ పోటీల్లో పి . హస్మ, ఏ . సాత్విక, పి . రుహినా అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. అలాగే Sd. మైమున్, ఏ . సాయి చంద్రిల్, ఎం . లోకేష్, వి . చంద్రకాంత్, జె . సార్ధక్, ఏ . వర్షిని వెండి పతకాలు సాధించారు. వి . విక్రాంత్, బి . వరుణ్ కాంస్య పతకాలు సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను అరుణోదయ పాఠశాల కరస్పాండెంట్ జ్ . చంద్రశేఖర్ అభినందించారు. విద్యార్థులకు శిక్షణ అందించిన కరాటే మాస్టర్ పి . చాంద్ భాషాను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరాటే మాస్టర్ మోహన్ రావు పాల్గొని విజేతలను అభినందించారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.