ఇటీవల అనారోగ్యముతో మరణించిన అలగాయపాలెం గ్రామ పెద్ద కాపు వాయల వెంకటేశ్వర్లు కుమారుడు అంకయ్య చిత్ర పటానికి నివాళి అర్పించి…వారి తండ్రికి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేశవరపు జాలిరెడ్డి వాయల అంకయ్య చిన్న పిల్లలకు భవిష్యత్తులో విద్యాపరంగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా నిచ్చి, ప్రస్తుతం వాయల అంకయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. జాలిరెడ్డి తో పాటు ఆ కుటుంబాన్ని పరామర్శించిన తెడ్డు శ్రీనివాసులరెడ్డి కూడా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పరామర్శించి నివాళి అర్పించిన వారిలో గ్రామ మాజీ సర్పంచి కొక్కిలగడ్డ వెంకటకృష్ణారావు, గ్రామ అధ్యక్షులు రామాల కృష్ణారెడ్డి, పీతా రామకృష్ణ, కటారి శ్రీకాంత్, నల్లపరెడ్డి సుధాకర్ రెడ్డి,కటారి తిరుపతి,వాయల బాబు, తదితరులు ఉన్నారు…

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *