సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా తెలియజేయునది ఏమనగా ,వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సంతోషంగా మరియు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే పై అధికారుల ఆదేశాల మేరకు వినాయక మండపాల వద్ద గానీ, వినాయక ఊరేగింపులో గానీ DJలు ఏర్పాటు చేయడానికి ఎటువంటి అనుమతులు లేవు. కావున DJలు ఏర్పాటు చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరుచున్నాము, ఇప్పటికే DJల కోసం ఏమైనా అడ్వాన్స్ చెల్లించి ఉంటే వెంటనే తిరిగి తీసుకోవాలని తెలుపుచున్నాము. పాకల సముద్ర తీరం వద్ద నిమజ్జనం సందర్భంగా సాయంత్రం ఏడు గంటల లోపే అనుమతులు ఉంటాయని తెలిపారు. కనుక పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించి, అందరూ ఆనందంగా మరియు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సింగరాయకొండ ఎస్సై లేళ్ల సుధీర్ కుమార్ కోరుతున్నాము.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *