రోడ్డు ప్రమాదాల నివారణకు రెక్టిఫికేషన్ చర్యలపై డీఎస్పీ, ట్రాఫిక్ సీఐతో సమీక్ష
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ గారు, ట్రాఫిక్ సీఐ గారితో కలిసి ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను (Accident Prone Spots) క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు, వాహనదారులకు ఎదురయ్యే ఇబ్బందులు, రహదారి భద్రతా అంశాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల (RTA) నివారణకు చేపట్టాల్సిన రెక్టిఫికేషన్ చర్యలపై అధికారులతో చర్చించారు.ప్రమాద ప్రాంతాల్లో అవసరమైన హెచ్చరిక సైన్ బోర్డులు, బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్ల గుర్తింపు, విజిబిలిటీ మెరుగుదల వంటి భద్రతా చర్యలను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణ – ప్రజల సురక్షిత ప్రయాణమే ప్రకాశం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం.