తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ రెండవ రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తూ… భవిష్యత్ విజయాలకు కార్యాచరణ రూపొందిస్తున్న టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్!