తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
అమరావతిలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ‘లీడర్షిప్ కాంక్లేవ్’ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్నాను.ఈ సందర్భంగా పరిపాలనా సంస్కరణలు, సోషల్ మీడియా వ్యూహాత్మక వినియోగం, ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడం వంటి కీలక అంశలు,ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వారి నుంచి నేరుగా అభిప్రాయాలు స్వీకరించడం, పబ్లిక్ అవుట్రీచ్ కార్యక్రమాలను విస్తృతం చేయడంపై సమావేశంలో చర్చించాము. పాలనలో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వ సంక్షేమ సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వివరించాను.’స్వర్ణాంధ్ర–2047′ దిశగా రాష్ట్ర అభివృద్ధి సాధించడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని, ప్రజా సంబంధాలను నిరంతరం పటిష్టం చేసుకుంటూ సమర్థవంతమైన పాలన అందించాలని తెలియజేశాను.