తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :-
మార్కాపురం జిల్లా కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా హిందువులు ఏర్పాటు చేసుకునే వినాయక మండపాలకు కమిటీ సభ్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్న కారణంగా వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఒకే చోట అనుమతులు కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ విజయ సునీతకు బిజెపి జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారావు తన బృందంతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పి వీ కృష్ణారావు మాట్లాడుతూ హిందువుల పండుగలలో అంబరాన్ని అంటే సంబరాలు చేసుకునే వినాయక చవితి పండుగకు ఆంక్షలు ఎత్తేసి ఒకే చోట అన్ని పర్మిషన్లు దొరికే విధంగా వసతి కల్పించాలని అన్నారు. కోన్ని మతాలకు లేని ఆంక్షలు హిందూ మతానికే ఎందుకని ఆయన ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వారు నిర్వహించుకునే పండుగకు అధికారులు సహకరించాలని కోరారు. స్పందించిన జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పర్మిషన్ ఒకే చోట దొరికే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరాల శ్రీనివాస్ రెడ్డి జెవి నారాయణ బెల్లంకొండ విజయలక్ష్మి రాజా శ్రీకాంత్ శివప్రసాద్ మధ్యల లక్ష్మి కమల్ గుప్తా పాల్గొన్నారు.