శానంపూడి గ్రామ ప్రజల చిరకాల రోడ్డు సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు స్పష్టమైన హామీ ఇచ్చారని టీడీపీ నాయకులు తెలిపారు.2018 ఫిబ్రవరి నెలలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు శానంపూడి గ్రామం రోడ్డు నిర్మాణానికి శాంక్షన్ చేయించారని తెలిపారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం శానంపూడి గ్రామం రోడ్డు అభివృద్ధిని పట్టించుకోకుండా విద్వాంసానికి కారకులు అయ్యారు అని అన్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో శానంపూడి గ్రామం రోడ్డు సమస్యను మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి దృష్టికి తీసుకెళ్లగా, సమస్యను పరిష్కరించి త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, శానంపూడి గ్రామం రోడ్డు నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.రోడ్డు విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని టీడీపీ నాయకులు కోరారు. 2018లోనే రోడ్డు కోసం ఎవరు శాంక్షన్ చేయించారు, 2019 తర్వాత ఎవరి హయాంలో పనులు నిలిచిపోయాయి అనే వాస్తవాలను ప్రజలు గుర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ సీనియర్ నాయకులు మందలపు బ్రహ్మనాయుడు, గద్దె కోటయ్య, చిమ్మిరి చెంచు రామయ్య, సూది సుబ్బయ్య, కోడిపల్లి బాబూరావు, కాకు కొండలరావు, రావినూతల ఏడుకొండలు, కాకు రాంబాబు, రావినూతల కొండయ్య, మంచికలపాటి ప్రసాద్, రావినూతల అభిషేక్, తగరం బాల కోటయ్య, రావినూతల మాతయ్య, జంగిలి మాధవ, మల్లెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *