మూడేళ్ల క్రితం ఇదే రోజున ప్రజా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు నిర్బంధించిన చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కందుకూరు నియోజకవర్గంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.నా ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి “జై తెలుగుదేశం.. జై చంద్రబాబు.. నిజం గెలిచింది” అంటూ నినదించారు.చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ప్రజల్లో మరింత చైతన్యం నింపింది. 2024 ఎన్నికల్లో వైసీపీ నిరంకుశ పాలనకు ప్రజలు తమ ఓటుతో గట్టి సమాధానం చెప్పారు.నేడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అమరావతి, పోలవరం, వెలిగొండ వంటి కీలక ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.సత్యాన్ని ఎంతకాలం అణచివేసినా.. చివరికి గెలిచేది నిజమే!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *