ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చీమకుర్తి సీఐ గారి ఆధ్వర్యంలో ఇలపావులూరు గ్రామ శివారులోని జూద స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న 7 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.59,120 నగదు, ప్లేయింగ్‌ కార్డులు, 9 ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.జూదం, బెట్టింగ్‌ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.జూదానికి దూరంగా ఉండండి – చట్టాన్ని గౌరవించండి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *