తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంలో పరిమితులు పాటించాలి – ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలకు సహకరించాలి ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ ఇచ్చారు.రాబోయే గణేష్ ఉత్సవాలు, వినాయక విగ్రహాల ఊరేగింపుల నేపథ్యంలో డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి సంబంధించిన నిబంధనలు, పరిమితులపై నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు చేశారు.అధిక శబ్దంతో డీజే సౌండ్ సిస్టమ్‌లను వినియోగించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా వ్యవహరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని డీజే నిర్వాహకులకు సూచించారు.