తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో చేపడుతున్న చెరువు కట్ట నిర్మాణ పనులను దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు శనివారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు.పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి రైతులకు, గ్రామ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రామయ్య, నారాయణ స్వామి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.