ఒంగోలు రిమ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్. విజయ్ కుమార్ గారు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు ప్రారంభించారు.
పేదలకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు, అత్యవసర చికిత్స సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ఏర్పాటు చేస్తోందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు, అత్యవసర వైద్యం అవసరమైన పేదలకు అత్యాధునిక ఐసీయూ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *