తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13-09-2026న నిర్వహించిన ఆర్చరీ జిల్లాస్థా పోటీలలో స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్, సింగరాయకొండ 7వ తరగతి విద్యార్థిని చైత్ర ఘన విజయం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యింది.ప్రకాశం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీ రాజు గారు, వివిధ జిల్లా అధికారులు మరియు రాష్ట్ర అబ్సెర్వర్ చైత్రను అభినందిచారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ గీతారాణి గారు, చైర్మన్ శ్రీనివాస్ గారు, జనరల్ మేనేజర్ హరిప్రసాద్ గారు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు చైత్రను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఆర్చరీ, స్కేటింగ్, హార్స్ రైడింగ్ వంటి వివిధ క్రీడా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి తదితర పోటీలలో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి అనేక అవకాశాలను కల్పిస్తున్నారు.విద్యార్థులు ఎంతో ఆసక్తితో క్రీడలు, వివిధ కార్యకలాపాలతో పాటు చదువులోనూ ప్రతిభకనబరుస్తున్నారు.భవిష్యత్తులో కూడా స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులందరూ క్రీడలు, వివిధ కార్యకలాపాలు మరియు విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతులు సాధించాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.చైత్ర సాధించిన ఈ విజయం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.