దర్శి నియోజకవర్గంలో త్రాగునీటి అవసరాల కోసం సాగర్ జలాలను రప్పించేందుకు మన టిడిపి ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు చేసిన కృషి ఫలించింది.నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు, NSP అధికారులతో పలుమార్లు మాట్లాడి సాగర్ జలాల విడుదలకు కృషి చేశారు. ఫలితంగా నేడు ఆదివారం సాయంత్రం రాజానగరం, మోదేపల్లి మేజర్ కాలువల్లో సాగర్ జలాలు ప్రవేశించడం శుభపరిణామం.ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని త్రాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్న వేళ, ఈ సాగర్ జలాలు నియోజకవర్గంలోని RWS ట్యాంకులను నింపేందుకు ఎంతో ఉపయోగపడనున్నాయి.ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, NSP అధికారులకు డాక్టర్ లక్ష్మీ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సాగర్ జలాలను త్రాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని, వృథా చేయవద్దని డాక్టర్ లక్ష్మీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *