తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఆదివారం ఒంగోలు నియోజకవర్గ పరిధిలో 150 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ముందుగా స్థానిక 4వ డివిజన్ ఇస్లాంపేటలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రోగులకు అందుతున్న సేవలపై వైద్యులకు, సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించిన ప్రజలకు 150 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 119 ప్రైవేట్ హాస్పిటల్స్ వారి సహకారంతో 680 మంది వైద్య సిబ్బంది ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. సుమారుగా వైద్య శిబారాలకు 9567 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్బంగా జనార్దన్ గారు మాట్లాడుతూ ఒంగోలు మున్సిపాలిటీ అభివృద్ధిలో నగర ప్రజల కృషి ఎంతో ఉందని, వారు ఆరోగ్యంగా.. సంతోషంగా ఉండాలనే తన అభిలాష అని ఆయన పేర్కొన్నారు. 150 వైద్య శిబిరాలలో ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు కు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం వినాయక చవితి పండగ ఉన్నా ఈ వైద్య శిబిరం ఏర్పాటులో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ తో పాటు 119 హాస్పిటల్స్, వారి సిబ్బంది అందించిన సహకారానికి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు తెలిపారు.