తొలి శుభోదయం న్యూస్ అన్నమయ్య:-
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ–జనసేన–బీజేపీ NDA కూటమి నేతల తొలి సమన్వయ మరియు సన్నాహక సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య.ఈ సమావేశంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గారు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నమయ్య జిల్లాలో 100% స్ట్రైక్ రేట్‌తో NDA కూటమి ఘన విజయం సాధించడమే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయి సమన్వయం, నాయకులు–కార్యకర్తల భాగస్వామ్యం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేస్తూ, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.