వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాళ్లపాడు పరిరక్షణ కమిటీ కార్యాలయంలో గణనాథుడికి ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దివి శివరామ్ మాట్లాడుతూ, వినాయకుడి ఆశీస్సులతో కందుకూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రిజర్వాయర్ మరియు చెరువులు నిండి త్రాగు సాగునీరుకి కొరత లేకుండా పంటలు బాగా పండి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాళ్లపాడు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కాకుమాను మాధవరావు ఉపాధ్యక్షుడు నంబూరు సుధాకర్ రావు గొంది మహిధర్ ప్రచార కార్యదర్శి షేక్ జిలాని భాయ్ దివి రమణయ్య కొల్లు ప్రసాద్ షేక్ ఆబిద్ కృష్ణయ్య మరియు బజాజ్ షోరూం సిబ్బంది మరియు కుల మతాలకతీతంగా స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *