వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం
తొలి శుభోదయం న్యూస్ కంభం:-
కంభం పట్టణానికి చెందిన రావూరి కాశీ రంగ రమేష్ బాబు ( ఎస్వీకేపీ పాలిటెక్నికల్ కాలేజ్ ఉపాధ్యక్షులు) ఆధ్వర్యంలో తన స్వగృహం, చౌక్ సెంటర్ మరియు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం దగ్గర సుమారు 1000 పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ఈ మూడు ప్రాంతాలలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. భక్తులు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రావూరి లోకేష్ పేర్లే మురళి పైడిమర్రి మహేష్,సాయి, రవి, సుబ్రహ్మణ్యం మరియు భారతీయ జనతా పార్టీ కంభం మండల అధ్యక్షులు బాదం కిశోర్ తో పాటు పలువురు నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. పర్యావరణహిత వినాయక ఉత్సవాలను నిర్వహించాలని వారు కోరారు….