తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు నియోజకవర్గ పరిధిలోని 21 వైన్ షాపుల లైసెన్స్‌లను మరో ఏడాది కాలానికి రెన్యూవల్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎక్సైజ్ సీఐ డి. మౌలాలి తెలిపారు.
01-10-2026 నుంచి 30-09-2027 వరకు లైసెన్స్‌లను రెన్యూవల్ చేసుకోవచ్చని చెప్పారు.
గత లైసెన్స్ ఫీజుపై 38 శాతం అదనంగా చెల్లించాలని, ఈ నెల 21వ తేదీలోగా రెన్యూవల్ ఫీజును తప్పనిసరిగా చెల్లించాలని సూచించారు.
కందుకూరు అర్బన్ – 5
కందుకూరు రూరల్ – 2
వలేటివారిపాలెం మండలం – 3
లింగసముద్రం మండలం – 3
గుడ్లూరు మండలం – 4
ఉలవపాడు మండలం – 4
రెన్యూవల్ చేసుకోని షాపులకు ఈనెల 30వ తేదీన తిరిగి టెండర్ ప్రక్రియ నిర్వహిస్తామని, టెండర్‌లో పాల్గొనే ప్రతి దరఖాస్తుదారుడు రూ.3 లక్షల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కో షాపునకు కనీసం నలుగురు దరఖాస్తుదారులు ఉన్నప్పుడే లాటరీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.