దొనకొండ మండలం దొనకొండ–గజ్జలకొండ రోడ్డు వయా ఇండ్ల చెరువు రహదారి అభివృద్ధి కోసం ₹1 కోటి 96 లక్షల నిధులతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ఈరోజు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.అధికారులు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, స్థానిక నాయకులు మరియు కూటమి శ్రేణులతో కలిసి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి… దర్శి నియోజకవర్గ ప్రగతే లక్ష్యంగా ముందడుగు!ఈ కార్యక్రమంలో దొనకొండ మండల టీడీపీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వర రావు, దొనకొండ టౌన్ టీడీపీ అధ్యక్షులు షేక్ తోహిద్ అంజూమ్, నూనె విజయ్ కుమారి, రమణ యాదవ్, చెన్నయ్యతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు, క్లస్టర్, యూనిట్ & బూత్ ఇంచార్జిలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *