టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఈరోజు కళాశాల రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఓజోన్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ ఓజోన్ పొరను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేశారు. ఓజోన్ పొర కి ఏర్పడిన ప్రమాదాన్ని గురించి వివరిస్తూ, దానిని కాపాడటానికి శాస్త్రవేత్తలు మరియు వివిధ వాతావరణ సదస్సులు చేసిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఓరుగంటి ఆంజనేయులు ఓజోన్ పొరను కనుక్కున్న 1913 నుంచి జరిగినటువంటి వివిధ పరిణామాల్ని వివరించారు. ఓజోన్ పొర విచ్చిత్తికి కారణమైన వివిధ సాంకేతికపరమైన అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులువుగా వివరించారు. ఆ తర్వాత ఓజోన్ పొరను తిరిగి పునరుద్ధరించడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని వివరిస్తూ, 2066 నాటికి ఓజోన్ పొర తిరిగి 1980 నాటి స్థితికి చేరుకునే అవకాశం ఉందని తెలియజేశారు. కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎన్వి శ్రీహరి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని తెలియజేశారు మరియు భూమి పైభాగంలో ఉన్న వివిధ పొరలలో జరిగే మార్పులను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తెలియజేశారు.రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ కె. జయ ప్రశాంతి ఓజోన్ పొర విచ్చిత్తికి సంబంధించిన ఒక వీడియోను తయారుచేసి విద్యార్థులకు ప్రదర్శించారు. రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ కె వి పద్మావతి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. అదేవిధంగా కళాశాల హిందీ విభాగం అధ్యాపకులు శ్రీ డి. రాఘవరావు హిందీ దివస్ యొక్క ప్రాముఖ్యతను, జాతీయ సమగ్రతను కాపాడటంలో హిందీ పోషించిన పాత్రను తెలియజేశారు. విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా హిందీ తప్పకుండా నేర్చుకోవాలని, జాతీయ భాషను గౌరవించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ పి. రాజగోపాల్, శ్రీ కె.నరేష్ రాజా, డాక్టర్ కె. శ్రీనివాసులు, డాక్టర్ ఎన్. తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *