తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
విద్యా రంగ అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్‌ఎస్‌ఆర్ పాఠశాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ప్రారంభించారు.వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు రూ.8 కోట్లతో ఆర్‌ఎస్‌ఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలను శ్రీ నారా లోకేష్ గారు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మరియు నా సహచర శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నాను.