తొలి శుభోదయం న్యూస్ కంభం:-
కంభం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు బుధవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. కంభం మండలం ఎంపీడీవో టి.వీరభద్రాచారి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల లొకేషన్లు, ఓటర్ల కేటాయింపు, పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన వివిధ సౌకర్యాలు తదితర అంశాలపై రాజకీయ పార్టీల నాయకులతో అధికారులు చర్చించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అంశాలను సమావేశంలో వివరించారు.ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్సార్‌సీపీ పార్టీల నాయకులు పాల్గొని ఎన్నికలకు సంబంధించిన తమ అభిప్రాయాలను ఎంపీడీవో టి.వీర భద్రాచారి గారి దృష్టికి తీసుకువచ్చారు.