మండల పరిధిలోని ఆలకూరపా డు గ్రామం లో గురువారం పోషణ మహోత్సవ కార్యక్రమం వేడుకలు ఘనం నిర్వహించారు.
మన అంగన్వాడీ – మన బాధ్యత అను కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భం టంగుటూరు ప్రాజెక్ట్ సూపర్వైజర్ జి.జ్యోతి పాల్గొని స్థానిక తల్లులతో అంగన్వాడీ సేవలను గురించి వివరిస్తూ పోషక ఆహారం లోపం మరియు పిల్లల లో ఎదుగుదల సమస్య లను గురిచి వివరించారు.ఆరోగ్యకరమైన పిల్లలు దేశానికి మంచి భవిష్యత్ అని అన్నారు భావితరాల భవిష్యత్ కోసం పిల్లల కు విద్యను అందించడం,తల్లి మరియు పిల్లల కు ఆరోగ్య సేవలు సకలం లో అంగన్వాడీ లు ద్యార అందించడం
ఆటల తో అభ్యాసం ,ఆరోగ్యకరమైన వికాసం,తల్లి గర్భం నుండి రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు అంగన్వాడీ కేంద్రాల లో 1000 రోజులు పాటు తల్లులకు అందుతున్న సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జి.జ్యోతి గారు,అంగన్వాడీ కార్యకర్తలు ,ఆయాలు మరియు స్థానిక తల్లులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *