తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు మరియు పోలీసు అధికారులు జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ విశ్వకర్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ మన నిత్య జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఒక శిల్పి, ఒక వృత్తి నిపుణుడి కృషి దాగి ఉంటుందని, సమాజంలో పలు రకాల వృత్తులు నిర్వహిస్తున్న వారి సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. శారీరక శ్రమకు, చేతి పనికి విలువ ఇవ్వడం ఎంత అవసరమో విశ్వకర్మ జయంతి మనకు గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వృత్తిని, శ్రమను గౌరవించుకోవాలని సూచించారు. ఈ ఆధునిక యుగంలో శ్రీ విశ్వకర్మ గారి సిద్ధాంతాలు, సృజనాత్మకత, కష్టపడే తత్వం, పట్టుదల మరియు నైపుణ్యాన్ని అలవరచుకుంటే ఎంత కష్టమైన పనినైనా సులభంగా సాధించవచ్చని తెలిపారు. విశ్వకర్మ అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలు, దుకాణాలు, ఇంజినీరింగ్ రంగం, ఆర్కిటెక్చర్ రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా వివిధ రకాల చేతివృత్తుల వారు, హస్తకళాకారులు, మెకానికులు, వెల్డర్లు, పారిశ్రామిక కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు మొదలైన వారు కూడా ఈ జయంతిని జరుపుకుంటారని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, ఏఆర్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.