ప్రకాశం జిల్లా పోలీసులు, మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా మహిళలు, బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకుని “శక్తి” యాప్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, బాలికలు తమ స్మార్ట్‌ఫోన్లలో శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే విధానం, యాప్‌ ద్వారా అందుబాటులో ఉన్న భద్రతా సదుపాయాలపై అవగాహన కల్పించారు.అలాగే విద్యార్థులు, మహిళలకు గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌ మధ్య తేడాను వివరించి, అసౌకర్యకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు.మహిళలు, బాలికలు తమ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న పోలీసు సహాయాన్ని వినియోగించుకోవాలని పోలీసులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా శక్తి యాప్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *