తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
బలయోగి నగర్ లోని గోవిందంబికా నగరలో గురువారం విశ్వకర్మ జయంతి మహోత్సవమ్ మరియు జండా ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి చందలూరి వెంకట శేషబ్రహ్మం మరియు మండల అధ్యక్షులు మరెళ్ల భాస్కరచారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలు కూనపరెడ్డి వెంకట సుబ్బారావు గారు జెండా ఆవిష్కరించి కార్యక్రమం ప్రారంభించారు మరియు ఈ జనసేన నేత రాజేష్ గారు పాల్గొన్నారు. సుబ్బారావు గారు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులుకు ఏ అవసరం ఉన్న మినిస్టర్ డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి మరియు ఆధ్రప్రదేశ్ మారిటైం బోర్డు చైర్మన్ శ్రీ దామాచర్ల సత్య గార్ల సహాయ సహకారాలతో తప్పక అన్ని విధాలుగా సహాయ పడతానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘీయులు అల్లూరి సురేష్, రావూరి శ్రీకాంత్, కవి రుద్రాచారి, లక్ష్మి నారాయణ మరియు తతిదరులు పాల్గొన్నారు