తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకులు మొలకలపల్లి కోటేశ్వరరావు ని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు వారి నివాసంలో పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి గారు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.