చందవరం బౌద్ధ క్షేత్రం అభివృద్ధిని గురించి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించిన బౌద్ధ సంఘాల కార్యకర్తలు.
ధమ్మచక్ర ఫౌండేషన్, ఒంగోలు బుద్ధ విహార మరియు బౌద్ధధమ్మ ప్రచార కేంద్రం కార్యకర్తలుగా మేము 2017నుండి చందవరం బౌద్ధక్షేత్రం దగ్గర గత 8సంవత్సరాలుగా బౌద్ధ సమావేశలు, బౌద్ధ సమాగమాలు నిర్వహిస్తున్నాము.ఇక్కడ బౌద్ధ స్థూపం వద్ద టూరిజం గెస్ట్ హౌస్, మ్యూజియంను అభివృద్ధి పరచమని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు అనేకసార్లు విన్నవించడం జరిగినది. ఈ సందర్బగా ఒంగోలు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కలెక్టర్ మాట్లాడుతూ చందవరం బౌద్ధక్షేత్రం పూర్తిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు బుద్ధవిహార ట్రస్ట్ కార్యదర్శి ఉపాసక గాండ్ల హరిప్రసాద్, బౌద్ధధమ్మ ప్రచారకేంద్రం సమన్వయకర్త చావలి సుధాకరరావు, ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ అసిస్టెంట్ డైరెక్టర్ కరణం రాఘవరావు (రిటైర్డ్ ), ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక కమిటీ అధ్యక్షులు చుండూరి రంగారావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ మురళి పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *