మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మార్కాపురంలోని సాధనా డిగ్రీ కళాశాలలో మార్కాపురం ఈగల్ టీమ్ నిర్వహించింది.ఈ కార్యక్రమంలో మార్కాపురం సీఐ గారు, ఎస్‌ఐ గారు మరియు ఈగల్ టీమ్ సిబ్బంది పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక దుష్ప్రభావాలను వివరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు సూచించారు.యువత భవిష్యత్తు దేశ భవిష్యత్తు – మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *