ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆధారం లేని మహిళలు, యాచకులు, నిరుపేదలకు జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో శనివారం పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేయడంతో పాటు చెప్పులు కూడా అందించారు.ఈ సందర్భంగా సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దాతల సహకారం, సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రేమ్ బాబు, మైత్రేష్, చరణ్ తేజ, వేణు బాబు, చందన్ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *