మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మెగా “వజ్ర ప్రహార్” కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకలవ్య నగర్, ఏకలవ్య కాలనీ 2వ లైన్ మరియు ఎస్టేట్ 2వ లైన్ ప్రాంతాల్లో మార్కాపురం జిల్లా పోలీసుల ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ మరియు సిబ్బంది విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు ఆయా ప్రాంతాలను పూర్తిగా కార్డన్ చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు ఇతర అంశాలపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇళ్లను తనిఖీ చేసి, నివాసితుల వివరాలు, అనుమానాస్పద కదలికలు తదితర అంశాలను పరిశీలించారు.ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం – నేరాల నియంత్రణకు నిరంతర నిఘా, పటిష్టమైన తనిఖీలు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *