రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు ఆవరణలోని చెత్త, పిచ్చి మొక్కలను తొలగించారు. చెట్లకు పాదులు తీసి నీరు పోశారు. పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచేలా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు.పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణానికి దోహదపడుతుందని జిల్లా పోలీసులు తెలిపారు. పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించే కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని(SASA) ప్రతిజ్ఞ చేశారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌ఐలు రమణారెడ్డి, సీతారామరెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *